మా నాన్న మాట కాదని 'సీత' సినిమా చేశాను: బెల్లంకొండ శ్రీనివాస్
- రేపే థియేటర్లకు 'సీత' సినిమా
- పాత్ర పరంగా నాకు సంతృప్తినిచ్చింది
- సక్సెస్ ఇస్తుందనే నమ్మకం వుంది
నాకు 'సీత' కథ నచ్చింది .. మా నాన్నకు మాత్రం మరో కథ నచ్చింది .. అది యాక్షన్ ఎంటర్టైనర్. ఆ సినిమానే చేయమని నాన్న అన్నాడు. నేను ఎప్పుడూ మా నాన్న ఓకే చెప్పిన సినిమానే చేస్తాను. ఈ సారి మాత్రం నాకు 'సీత' కథ నచ్చిందని చెప్పి, ఆయన అభిప్రాయానికి వ్యతిరేకంగా ఈ సినిమా చేశాను. అందుకే ఈ సినిమా హిట్ కావాలని కోరుకుంటున్నాను. పాత్ర పరంగా నాకు ఎంతో సంతృప్తినిచ్చిన ఈ సినిమా, సక్సెస్ కూడా ఇస్తుందనే నమ్మకంతో వున్నాను" అని చెప్పుకొచ్చాడు.