‘సాహో’ సినిమాకు సంబంధించి వైరల్ అవుతున్న ఆసక్తికర వార్త!

  • ప్రభాస్ కథానాయకుడిగా తెరకెక్కుతున్న ‘సాహో’
  • ‘సాహో’లో అతిథి పాత్రలో సల్మాన్?
  • సల్మాన్‌కు పాత్ర గురించి వివరించిన నీల్ నితిన్
సుజిత్ దర్శకత్వంలో ప్రభాస్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న చిత్రం ‘సాహో’. రూ.300 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో బాలీవుడ్ భామ శ్రద్ధా కపూర్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమాకు సంబంధించి ఓ ఆసక్తికర వార్త నెట్టింట్లో వైరల్ అవుతోంది. ఈ చిత్రంలో బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ అతిథి పాత్రలో నటిస్తున్నట్టు తెలుస్తోంది.

‘సాహో’లో ప్రతినాయకుడి పాత్రలో నటిస్తున్న నీల్ నితిన్ ముఖేష్, సల్మాన్ స్నేహితులు కావడంతో అతిథి పాత్రకు సంబంధించిన వివరాలను ఆయనే వివరించారని సమాచారం. మరి దీనికి సల్లూభాయ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారో లేదో తెలియాల్సి ఉంది. ఒకవేళ ఇస్తే మాత్రం ఈ సినిమాకు బాలీవుడ్‌లో కూడా మంచి మార్కెట్ ఏర్పడుతుందనడంలో ఎలాంటి సందేహమూ లేదు.
Go Back to Shorts
Sahoo
Prabhas
Salman Khan
Sujith
Sradha Kapoor

More Telugu News