ఘరానా దొంగలు...పోలీస్ స్టేషన్ స్టోర్ రూంలోనే చోరీ
- విలువైన వస్తువులు ఎత్తుకెళ్లిన వైనం
- ఒక రోజు తర్వాత గుర్తించిన సిబ్బంది
- ఇద్దరు మహిళలు అరెస్టు... మరో ఇద్దరు పరారు
ఈ స్టేషన్ పరిధిలో స్టోర్ రూం ఉంది. వివిధ కేసులకు సంబంధించి స్వాధీనం చేసుకున్న ఫోన్లు, కార్లు, ఇతర విలువైన వస్తువులను ఈ స్టోర్ రూంలో భద్రపరుస్తుంటారు. మే 18వ తేదీ అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు ఈ స్టోర్ రూంలోకి చొరబడి 90 బ్యాటరీలు, రెండు గ్యాస్ సిలెండర్లు, సీసీ టీవీ కెమెరాలు, కార్లలోని విడి భాగాలు ఎత్తుకెళ్లారు.
20వ తేదీ ఉదయం వరకు ఈ చోరీని ఎవరూ గమనించ లేదు. ఆ రోజు ఉదయం స్టోర్ ఇన్‌చార్జి గది వద్దకు వెళ్లగా తాళం పగులగొట్టి ఉండడం గమనించారు. దీంతో వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. విచారణ చేపట్టిన దుండగులు మొత్తం నలుగురు ఈ చోరీకి పాల్పడినట్లు గుర్తించి ఇద్దరు మహిళలను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి కొన్ని వస్తువులు స్వాధీనం చేసుకున్నారు.