ఆ డైరెక్టర్ నన్ను 30 సార్లు చెంప దెబ్బలు కొట్టాడు.. కేన్స్ వేదికగా బయటపెట్టిన తైవాన్ బ్యూటీ!
- కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రదర్శితమైన ‘నినా వు‘
- రచించి, నటించిన నటి వు కె ఝి
- ఆ చేదు జ్ఞాపకాన్ని ఎప్పటికీ మర్చిపోలేనంటూ ఆవేదన
షూటింగ్ సందర్భంగా అది క్లోజప్ షాటా? లేక లాంగ్ షాటా? అని డైరెక్టర్‌ను అడిగానని, అందుకు అనుగుణంగా సిద్ధమవాలనే అలా ప్రశ్నించానని ఝి తెలిపింది. అయితే, తన ప్రశ్న వినగానే డైరెక్టర్ ఆగ్రహంతో తన చెంపను చెడామడా వాయించాడని, దాదాపు 30 సార్లు అతడి చేయి తన చెంపను బలంగా తాకిందని బాధగా చెప్పింది. ఆ తర్వాత ఆ షాట్‌ను క్లోజప్‌లోనే చిత్రీకరించారని పేర్కొంది. డైరెక్టర్ తనపై చేయి చేసుకోవడంతో అందరూ నిర్ఘాంతపోయారని వివరించింది. కేవలం ప్రశ్నించిన పాపానికి తీవ్ర శిక్షను ఎదుర్కోవాల్సి వచ్చిందని వాపోయింది.