యూట్యూబ్‌లో ఎన్నికల ఫలితాల ప్రత్యక్ష ప్రసారం.. గూగూల్‌తో డీడీన్యూస్ ఒప్పందం
- మరో 24 గంటల్లో ఎన్నికల లెక్కింపు ప్రారంభం
- యూట్యూబ్ ద్వారా ఫలితాలను అందించనున్న డీడీన్యూస్
- గూగుల్‌తో ఒప్పందం
ఓట్ల లెక్కింపు, ఫలితాల ప్రకటనలకు సంబంధించిన సమాచారాన్ని యూట్యూబ్ ద్వారా డీడీ న్యూస్ ఎప్పటికప్పుడు అందిస్తుందని ప్రసార భారతి సీఈవో శశిశేఖర్ వెంపటి తెలిపారు. గురువారం యూట్యూబ్‌ను ఓపెన్ చేసే వారికి అన్నింటికంటే పైన ఎన్నికల ప్రత్యక్ష ప్రసారం కనిపిస్తుందని శశిశేఖర్ పేర్కొన్నారు. మొత్తం 14 భాషల్లో ప్రత్యక్ష ప్రసారం చేస్తున్నట్టు తెలిపారు.