అమిత్ షా ఇచ్చిన విందుకు హాజరైన ప్రధాని మోదీ
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

అమిత్ షా ఇచ్చిన విందుకు హాజరైన ప్రధాని మోదీ

  • ఢిల్లీలోని అశోకా హోటల్ లో విందు
  • ఈ విందుకు మంత్రులు, ముఖ్య నేతలు హాజరు
  • మోదీకి ఎన్డీయే పక్ష నేతల సన్మానం
ఢిల్లీలోని బీజేపీ కార్యాలయంలో ఎన్డీయే పక్షాల నేతలు ఈరోజు సాయంత్రం సమావేశమయ్యారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి ప్రధాని మోదీ సహా కేంద్రమంత్రులు, బీజేపీ కీలక నేతలు హాజరయ్యారు. అనంతరం, స్థానిక అశోకా హోటల్ లో అమిత్ షా విందు ఏర్పాటు చేశారు. ఈ విందుకు మోదీ, మంత్రులు, ముఖ్య నేతలు, బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రే తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎన్డీయే పక్ష నేతలు మోదీకి సన్మానం చేసినట్టు సమాచారం.

కాగా, కేంద్రంలో మళ్లీ ఎన్డీయే ప్రభుత్వమే వస్తుందని ఎగ్జిట్ పోల్స్ పేర్కొన్నాయి. ఒకవేళ ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ రానిపక్షంలో ఎలాంటి వ్యూహాలు అనుసరించాలన్న అంశంపై విందుకు ముందు జరిగిన భేటీలో ఎన్డీయే పక్ష నేతలు చర్చించినట్టు సమాచారం.
modi
pm
bjp
amit shah
shiva sena
nda

More Telugu News