ఏ పార్టీకి ఓటు వేసినా ఒకే పార్టీకి పడుతోందని సీఈసీకి ఫిర్యాదు చేసాం: గులాం నబీ ఆజాద్
- సీఈసీతో గంటన్నరపాటు సమావేశమయ్యాం
- ఈవీఎంలలో సమస్యలను ఈసీ దృష్టికి తీసుకెళ్లాం
- తేడా వస్తే అసెంబ్లీ పరిధిలోని మొత్తం ఓట్లు లెక్కించాలి
వందశాతం వీవీప్యాట్స్ లెక్కించాలన్నదే మా ప్రధాన డిమాండ్: సింఘ్వీ
ఒకటిన్నర నెలలుగా లేవనెత్తిన అంశాలనే మళ్లీ ఈసీకి చెప్పామని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత అభిషేక్ సింఘ్వీ అన్నారు. తాము చేసిన ఫిర్యాదులపై ఎందుకు చర్యలు చేపట్టడం లేదని ఈసీని ప్రశ్నించినట్టు పేర్కొన్నారు. తాము చెప్పిన విషయాలను సుమారు గంట సేపు ఈసీ అధికారులు విన్నారని అన్నారు. తాము చేసిన ఫిర్యాదుల విషయమై మాట్లాడేందుకు రేపు ఉదయం సమావేశం కానున్నట్లు ఈసీ అధికారులు తమకు చెప్పారని అన్నారు. వందశాతం వీవీప్యాట్స్ లెక్కించాలన్నదే తమ ప్రధాన డిమాండ్ అని సింఘ్వీ మరోసారి స్పష్టం చేశారు.