ఘనంగా గాడ్సే పుట్టిన రోజు వేడుకలు... ఆరుగురు హిందూ మహాసభ కార్యకర్తల అరెస్ట్!
- సూరత్ లోని దేవాలయంలో వేడుకలు
- సోషల్ మీడియాలో ఫోటోలు, వీడియోలు
- తప్పుబట్టిన బీజేపీ నేతలు
ఆపై మిఠాయిలు పంచుకుని, భజన కార్యక్రమాల్ని నిర్వహించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు తీసి సోషల్ మీడియాలో పెట్టారు. విషయం పోలీసుల దృష్టికి వెళ్లడంతో, వారు కేసు నమోదు చేసి ఆరుగురిని అరెస్ట్ చేశారు. గాంధీని చంపిన వ్యక్తికి పుట్టిన రోజు వేడుకలు జరపడం విచారకరమని, ఈ తరహా చర్యలతో ప్రజల మనోభావాలు దెబ్బ తింటాయని ఈ సందర్భంగా ఓ పోలీసు అధికారి వ్యాఖ్యానించారు. పలువురు బీజేపీ నేతలు సైతం హిందూ మహాసభ కార్యకర్తల వైఖరిని తప్పుబట్టారు.