వివేక్ ఒబెరాయ్ ట్వీట్‌తో దుమారం.. డిలీట్ చేసి క్షమాపణలు చెప్పాలంటూ డిమాండ్
- నెటిజన్ చేసిన మీమ్‌ను పోస్ట్ చేసి కలకలం రేపిన వివేక్
- మండిపడుతున్న ప్రముఖులు
- క్షమాపణలు చెప్పాలన్న మధుర్ బండార్కర్
వివేక్ పోస్టు చేసిన ఈ ట్వీట్‌పై రాజకీయ, సినీ, క్రీడారంగాలకు చెందిన ప్రముఖులు, నెటిజన్లు మండిపడుతున్నారు. నటి సోనమ్ కపూర్, క్రీడాకారిణి గుత్తా జ్వాలతోపాటు వివేక్‌పై విరుచుకుపడ్డారు. ఓ నటుడు అయి ఉండీ మరో నటిని కించపరిచేలా ఈ పోస్టులు ఏంటంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓ బాధ్యత గల సెలబ్రిటీ అయి ఉండీ మరొకరి మనోభావాలను కించపరచడం దారుణమంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
తాజాగా బాలీవుడ్ దర్శకుడు మధుర్ బండార్కర్ స్పందించారు. వివేక్ వెంటనే ఈ ట్వీట్‌ను డిలీట్ చేసి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. వివేక్ నుంచి తాను ఇలాంటి ట్వీట్‌ను ఊహించలేదన్న మధుర్.. విమర్శకులు ఎంతకైనా తెగిస్తారని, కానీ వివేక్ నుంచి ఇలాంటి ట్వీట్‌ను ఊహించలేదని అన్నాడు. బాధ్యత కలిగిన సెలబ్రిటీగా వెంటనే ఆ ట్వీట్‌ను డిలీట్ చేసి క్షమాపణలు వేడుకోవాలని ట్వీట్ చేశాడు. కాగా, ఐశ్వర్యపై అనుచిత పోస్టు చేసిన వివేక్‌కు మహిళా కమిషన్ వివరణ కోరుతూ నోటీసులు పంపింది.