ఎన్డీయేతర కూటమి ఏర్పాటుపై మమతతో ముగిసిన చంద్రబాబు భేటీ
- నేటి మధ్యాహ్నం కోల్‌కతా వెళ్లిన చంద్రబాబు
- ఎన్నికల అనంతరం చేపట్టాల్సిన చర్యలపై చర్చ
- రేపు ఈసీ ప్రధాన కార్యాలయం ఎదుట ధర్నా
ఈ సమావేశంలో ముఖ్యంగా ఎన్నికల ఫలితాలపై చర్చించినట్టు తెలుస్తోంది. ఫలితాల అనంతరం చేపట్టాల్సిన చర్యలపై చంద్రబాబు ముఖ్యంగా చర్చించినట్టు సమాచారం. రేపు మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకూ ఈసీ ప్రధాన కార్యాలయం వద్ద 23 ఎన్డీయేతర పక్షాల నేతలు ధర్నా చేపట్టనున్నారు. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు మరికాసేపట్లో కోల్‌కతా నుంచి ఢిల్లీ వెళ్లనున్నారు.