'మహర్షి' విజయానందంతో విహారయాత్రకు బయలుదేరిన మహేశ్ బాబు!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

'మహర్షి' విజయానందంతో విహారయాత్రకు బయలుదేరిన మహేశ్ బాబు!

  • ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్న మహేశ్ బాబు
  • ట్విట్టర్ లో ఫొటో
  • ఇది చాలా ప్రత్యేకం అంటూ క్యాప్షన్
టాలీవుడ్ అగ్రహీరో మహేశ్ బాబు తన లేటెస్ట్ మూవీ మహర్షి సక్సెస్ ను బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చిన మహర్షి చిత్రం విశేషరీతిలో ప్రేక్షకాదరణ పొందుతోంది. మొదటి ఆట నుంచే కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ఇప్పటికే మహర్షి చిత్రబృందం థాంక్యూ మీట్లు, సక్సెస్ మీట్లతో అభిమానుల ముందుకు వచ్చింది. మహేశ్ బాబు సైతం ఎక్కడ విజయోత్సవ సభ పెడితే అక్కడికి వచ్చి తన ఆనందోత్సాహాలను అభిమానులతో పంచుకున్నారు. తన సంతోషానికి కొనసాగింపుగా ఫ్యామిలీతో కలిసి మరోసారి విదేశాలకు వెళ్లారు.

భార్య నమ్రత, కుమారుడు గౌతమ్, కుమార్తె సితారలతో కలిసి ఎయిర్ పోర్టులో ఎమిరేట్స్ లాంజ్ లో కూర్చుని ఉన్న ఫొటో ఇప్పుడు సోషల్ మీడియాలో సందడి చేస్తోంది. ఈ ఫొటోను మహేశ్ బాబు తన ట్విట్టర్ అకౌంట్ లో షేర్ చేశారు. మరో మరపురాని విహారయాత్రకు వెళుతున్నాం... అయితే ఇది చాలా ప్రత్యేకం అంటూ క్యాప్షన్ పెట్టారు. అంతేకాదు, మహర్షి విజయాన్ని సెలబ్రేట్ చేసుకుంటున్నాం అంటూ హ్యాష్ టాగ్ ఇచ్చారు.
Mahesh Babu

More Telugu News