కొనసాగుతున్న తుది విడత ఎన్నికల పోలింగ్.. ఇప్పటి వరకు ఓటేసిన ప్రముఖులు వీరే

  • పోలింగ్ కేంద్రాల వద్ద చాంతాడంత బారులు
  • చాలాసేపు క్యూలో నిల్చుని ఓటేసిన భజ్జీ
  • పట్నాలో ఓటు హక్కు వినియోగించుకున్న నితీశ్, సుశీల్ మోదీ, రవిశంకర్ ప్రసాద్
  • గోరఖ్‌పూర్‌లో ఆదిత్యానాథ్..
సార్వత్రిక ఎన్నికల చివరిదశ పోలింగ్ జోరుగా కొనసాగుతోంది. పలువురు ప్రముఖులు ఇప్పటికే తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్  గోరఖ్‌పూర్‌లోని 246 పోలింగ్‌ కేంద్రంలో ఓటు వేశారు.

బీహార్‌ ముఖ్యమంత్రి నితీశ్‌ కుమార్‌ పాట్నాలోని రాజ్‌భవన్‌ పరిథిలో ఉన్న పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్‌ బూత్‌లో ఓటేయగా, ఉపముఖ్యమంత్రి సుశీల్‌ కుమార్‌ మోదీ పాట్నాలోని 46వ నంబరు పోలింగ్‌ కేంద్రంలో ఓటేశారు. టీమిండియా  క్రికెటర్‌ హర్భజన్‌ సింగ్‌  పంజాబ్‌లోని జలంధర్ జిల్లా పరిథిలోని గార్హి గ్రామంలోని పోలింగ్ కేంద్రంలో ఓటేశాడు. పోలింగ్ ప్రారంభమైన కాసేపటికే ఓటేసేందుకు వచ్చిన భజ్జీ చాలాసేపు క్యూలో నిల్చుని ఓటు హక్కు వినియోగించుకున్నాడు. కేంద్ర మంత్రి, బీజేపీ నేత రవిశంకర్‌ ప్రసాద్ తన కుటుంబ సభ్యులతో కలిసి పాట్నా మహిళా కళాశాలలోని 77 నంబరు పోలింగ్‌ కేంద్రంలో ఓటు వేశారు.
Go Back to Shorts
Elections
polling
nitish kumar
Yogi adityanath
Harbhajan singh

More Telugu News