మహేశ్ కోసం అనిల్ రావిపూడి అదిరిపోయే కామెడీ ఎపిసోడ్ ను రెడీ చేశాడట
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

మహేశ్ కోసం అనిల్ రావిపూడి అదిరిపోయే కామెడీ ఎపిసోడ్ ను రెడీ చేశాడట

  • మహేశ్ బాబుతో అనిల్ రావిపూడి 
  • వచ్చేనెలలో షూటింగు మొదలు
  • వినోదమే ప్రధానంగా సాగే కథ  
అనిల్ రావిపూడి తన తదుపరి సినిమాను మహేశ్ బాబుతో చేయనున్నాడు. త్వరలోనే ఈ ప్రాజెక్టు పట్టాలెక్కనుంది. ప్రస్తుతం అందుకు సంబంధించిన సన్నాహాలు జరుగుతున్నాయి. పూర్తి వినోదభరితంగా ఈ సినిమాను అనిల్ రావిపూడి రూపొందించనున్నాడు. ఈ సినిమాలో ట్రైన్ నేపథ్యంలో వచ్చే కామెడీ ఎపిసోడ్ హైలైట్ గా నిలుస్తుందనే టాక్ ఫిల్మ్ నగర్లో వినిపిస్తోంది.

గతంలో శ్రీను వైట్ల దర్శకత్వంలో 'వెంకీ' అనే సినిమా వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలోని ట్రైన్ ఎపిసోడ్ ను చాలామంది ఇప్పటికీ మరిచిపోలేదు. ఆ ఎపిసోడ్ లో రవితేజ అండ్ గ్యాంగ్ ఒక రేంజ్ లో నవ్వులు పూయిస్తారు. అదే తరహా కామెడీని అనిల్ రావిపూడి ప్లాన్ చేసినట్టుగా చెబుతున్నారు. ట్రైన్ ఎపిసోడ్ మహేశ్ బాబు .. బండ్ల గణేశ్ .. శ్రీనివాస రెడ్డి తదితరులపై ఉంటుందని అంటున్నారు. వచ్చేనెలలో ఈ సినిమా షూటింగ్ మొదలుకానుంది. 
Mahesh Babu

More Telugu News