సితార పాప ఎదిగిపోయింది, తనకు అన్నీ తెలుస్తున్నాయి: మహేశ్ బాబు
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

సితార పాప ఎదిగిపోయింది, తనకు అన్నీ తెలుస్తున్నాయి: మహేశ్ బాబు

  • మహర్షి చిత్రం చూసి ఏడ్చేసింది
  • పిల్లలిద్దరూ బాగా కనెక్టయ్యారు
  • మహర్షితో నేనూ మారిపోయాను
టాలీవుడ్ అగ్రహీరో మహేశ్ బాబు తన కెరీర్ లో నటించిన 25వ చిత్రం మహర్షి. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం ఇటీవలే రిలీజ్ కాగా, అన్ని వర్గాల నుంచి సానుకూల స్పందన వస్తోంది. బాక్సాఫీసు వద్ద కూడా మహర్షి కాసుల వర్షం కురిపిస్తోంది. మహేశ్ బాబు కెరీర్ లో ఫస్ట్ వీక్ లో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన చిత్రంగా నిలిచింది. ఈ నేపథ్యంలో, ఓ కార్యక్రమంలో పాల్గొన్న మహేశ్ మహర్షి చిత్రం తన కుటుంబ సభ్యులను ఎలా ప్రభావితం చేసిందీ చెప్పుకొచ్చారు.

మహర్షి చిత్రంతో తన పిల్లలు సితార, గౌతమ్ ఎంతో కనెక్టయ్యారని చెప్పారు. ముఖ్యంగా సితార మహర్షి సినిమా చూసి ఏడ్చేసిందని, తను ఎదిగిపోయిందన్న విషయం, తనకు అన్నీ తెలుస్తున్నాయన్న విషయం ఆ సంఘటనతో అర్థమైందని వివరించారు. గౌతమ్ అభినందన పూర్వకంగా హైఫై ఇచ్చాడని, పిల్లల సంతోషం చూసిన తర్వాత తాను కూడా ఆనందంగా ఫీలయ్యానని మహేశ్ తెలిపారు.

"మహర్షి చిత్రంతో నాలోనూ ఎంతో మార్పు వచ్చింది. రెండేళ్ల క్రితం ఉన్న మహేశ్ వేరు, ఇప్పుడున్న మహేశ్ వేరు. ఇకమీదట కుటుంబంతో కలిసి ఏడాదికి ఒక్కసారైనా గ్రామాలకు వెళ్లాలని నిర్ణయించుకున్నాను. నన్ను నా మూలాలతో కనెక్ట్ చేసిన చిత్రం మహర్షి" అంటూ మహేశ్ బాబు భావోద్వేగాలకు లోనయ్యారు.
Mahesh Babu

More Telugu News