కర్ణాటక కాంగ్రెస్ నాయకురాలు రేష్మా అనుమానాస్పద మృతి!

  • నిన్న పక్కింటి వ్యక్తితో కలిసి తన కారులో వెళ్లిన రేష్మా
  • కృష్ణానదిలో ఆమె మృతదేహం లభ్యం
  • జేడీఎస్ నుంచి వచ్చి కాంగ్రెస్ లో చేరారు 
కర్ణాటక కాంగ్రెస్ నాయకురాలు రేష్మా పడెకనురా అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. కొల్హార్ కు సమీపంలో గల కృష్ణానదిలో ఆమె మృతదేహం తేలుతూ కనిపించింది. ఈ మేరకు సమాచారం అందుకున్న పోలీసులు ఆమె మృతదేహాన్ని నదిలో నుంచి బయటకు తీయించారు. రేష్మా మృతిపై పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అనుమానాస్పద మృతి కింద పోలీసులు కేసు నమోదు చేశారు. నిన్న పక్కింటి వ్యక్తితో కలిసి తన కారులో ఆమె బయటకు వెళ్లినట్టు సమాచారం. ఆ తర్వాత ఆమె శవమై నదిలో తేలింది. కాగా, 2013లో జేడీఎస్ పార్టీ తరపున తనకు సీటు కేటాయించకపోవడంతో ఆమె అసంతృప్తి చెందారు. గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు జేడీఎస్ నుంచి బయటకు వచ్చి కాంగ్రెస్ పార్టీలో చేరారు.   
Go Back to Shorts
Karnataka
congress
Reshma
JDS

More Telugu News