బీజేపీ, ఆరెస్సెస్ నేతలంతా గాడ్ లవర్స్ కాదు.. వాళ్లంతా గాడ్సే లవర్స్: రాహుల్ గాంధీ
- గాడ్సేపై బీజేపీ నేతల ప్రశంసల వర్షం
- ప్రజ్ఞా, హెగ్డే, నలిన్ కుమార్ ల వ్యాఖ్యలు
- కమలనాథులపై మండిపడ్డ కాంగ్రెస్ చీఫ్
గాడ్సే నిజంగా గొప్ప దేశభక్తుడని ప్రజ్ఞాసింగ్ ఠాకూర్ ఇటీవల వ్యాఖ్యానించారు. దీంతో అన్నివైపుల నుంచి విమర్శలు రావడంతో క్షమాపణలు కోరారు. అలాగే ఈరోజు కేంద్ర మంత్రి అనంతకుమార్ హెగ్డే స్పందిస్తూ.. గాడ్సేపై ప్రస్తుతం చర్చ జరగడం తనకు చాలా సంతోషంగా ఉందని సెలవిచ్చారు. కర్ణాటక బీజేపీ నేత నలిన్ కుమార్ కతీల్ ట్విట్టర్ లో స్పందిస్తూ..‘గాడ్సే కేవలం ఒక్కరినే చంపారనీ, కానీ రాజీవ్ గాంధీ మాత్రం 17,000 మందిని చంపారు’ అని ఆరోపించారు. అయితే ప్రజల నుంచి తీవ్రంగా వ్యతిరేకత రావడంతో తన ట్విట్టర్ హ్యాక్ కు గురయిందని హెగ్డే ప్రకటించగా, నలిన్ కుమార్ తన ట్వీట్ ను వెంటనే తొలగించారు.