Telangana: దేశంలోనే తెలంగాణ జైళ్ల శాఖ పనితీరు మెరుగ్గా ఉంది: డీజీ వీకే సింగ్

  • తెలంగాణలో 17 జైళ్లు మూతపడ్డాయి
  • ఇక్కడి  జైళ్లలో 30 మంది ఉగ్రవాదులు ఉన్నారు
  • త్వరలోనే 20 పెట్రోల్ బంకులు ప్రారంభిస్తాం

దేశంలోని అన్ని రాష్ట్రాల కంటే తెలంగాణ జైళ్ల శాఖ పనితీరు మెరుగ్గా ఉందని జైళ్ల శాఖ డీజీ వీకే సింగ్ అన్నారు. హైదరాబాద్ లో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, తెలంగాణలో 49 జైళ్లు ఉండగా, అందులో 17 జైళ్లు మూతపడ్డాయని, జైళ్లలో 30 మంది  ఉగ్రవాదులు ఉన్నట్టు చెప్పారు. మూతపడ్డ జైళ్లను సోషల్ వెల్ఫేర్ పనులకు వినియోగించుకునే నిమిత్తం ప్రభుత్వానికి ఓ నివేదిక పంపినట్లు చెప్పారు. వచ్చే ఆరు నెలల్లో జైళ్ల శాఖ ఆధ్వర్యంలో మరో 20 పెట్రోల్ బంక్ ప్రారంభిస్తామని అన్నారు. జైళ్ల శాఖలో రూ.200 కోట్ల ఆదాయం లక్ష్యంగా ఉందని, ఆర్జించిన లాభాలతో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని వివరించారు. ఖైదీల విడుదలకు సంబంధించి గవర్నర్ నరసింహన్ కు పంపిన జాబితా వెనక్కి వచ్చిందని, కొత్త జాబితా తయారు చేసి మళ్లీ పంపనున్నట్టు వీకే సింగ్ తెలిపారు.

More Telugu News