గాంధీని 'పాకిస్థాన్ జాతిపిత' అన్న బీజేపీ నేతపై వేటు

షార్ట్స్‌లో చూడండి
ఎన్నికల వేళ ఇప్పుడు దేశమంతా గాంధీ, గాడ్సేల గురించే చర్చ జరుగుతోంది. బీజేపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలు వివాదాన్ని రాజేస్తున్నాయి. తాజాగా పార్టీ అధికార ప్రతినిధి అనిల్ సౌమిత్రపై బీజేపీ అధిష్ఠానం వేటు వేసింది. పాకిస్థాన్ జాతిపిత మహాత్మాగాంధీ అంటూ ఫేస్ బుక్ లో ఆయన కామెంట్ చేశారు. అంతేకాదు, గాంధీలాంటి వాళ్లు కోట్ల మంది జన్మించారని... వారిలో కొందరు మంచివారు కాగా, మిగిలినవారంతా ఉపయోగం లేనివారని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యల నేపథ్యంలో, పార్టీలో అతని ప్రాథమిక సభ్యత్వాన్ని రద్దు చేశారు. ఏడు రోజుల్లోగా వివరణ ఇవ్వాలని ఆదేశించారు. బీజేపీ మీడియా రిలేషన్స్ విభాగానికి చీఫ్ గా సౌమిత్ర వ్యవహరిస్తున్నారు. 
Go Back to Shorts
gandhi
bjp
soumitra

More Telugu News