Sairaa: ఎండవేడిమికి గచ్చిబౌలిలో రష్యన్ సినీ జూనియర్ ఆర్టిస్ట్ మృతి

షార్ట్స్‌లో చూడండి
టూరిస్ట్ వీసాపై మార్చిలో హైదరాబాద్ కు వచ్చి, 'సైరా' సినిమాలో ఓ చిన్న పాత్రను పోషిస్తున్న అలెగ్జాండర్ (38) అనే రష్యన్ గచ్చిబౌలిలోని డీఎల్‌ఎఫ్‌ గేట్‌ నెంబర్‌–1 వద్ద అపస్మారక స్థితిలో కనిపించాడు. ఎండ వేడిమిని తాళలేక ఆయన పడిపోగా, పోలీసులు తొలుత కొండాపూర్ ఏరియా ఆసుపత్రికి, ఆపై గాంధీ ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మరణించాడు.

అతని కెమెరాలోని చిత్రాల ఆధారంగా, 4, 5 తేదీల్లో సైరా సినిమాలో నటించాడని, గచ్చిబౌలి సమీపంలోని ఓ హోటల్‌ లో నివాసం ఉంటున్నాడని పోలీసులు గుర్తించారు. వడదెబ్బ కారణంగానే అలెగ్జాండర్‌ మృతి చెందాడని, గోవాలో ఉన్న అతని స్నేహితునికి సమాచారం ఇచ్చామని, అతను వచ్చిన తరువాత పోస్టుమార్టం నిర్వహిస్తామని పోలీసులు పేర్కొన్నారు. 
Go Back to Shorts
Sairaa
Russia Artist
Died
Heat Wave

More Telugu News