బీజేపీకి 2014లో వచ్చినన్ని సీట్లు ఇప్పుడు రావు: కేంద్ర మంత్రి అథవాలే
- యూపీలో 10 నుంచి 15 సీట్లు కోల్పోతుంది
- మహారాష్ట్రలో ఐదు నుంచి ఆరు స్థానాలు తగ్గుతాయి
- ఎస్పీ-బీఎస్పీ కూటమి బీజేపీపై ప్రభావం చూపుతుంది
2014లో యూపీలో మొత్తం 80 సీట్లకు గాను బీజేపీ 73 స్థానాల్లో జయకేతనం ఎగురవేసింది. ఆ ఎన్నికల్లో ఎస్పీ, బీఎస్పీ, రాష్ట్రీయ లోక్ దళ్ పార్టీలు వేటికవే ఒంటిరిగా పోటీ చేశాయి. మహారాష్ట్రలో ఈ సారి ఐదు నుంచి ఆరు సీట్లను బీజేపీ కోల్పోతుందని అథవాలే చెప్పారు. మరోవైపు, ఈ సారి బీజేపీ మ్యాజిక్ ఫిగర్ ను అందుకోలేకపోవచ్చని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్ కూడా వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.