విశాఖ బీచ్ రోడ్డులో అక్కినేని, దాసరి, హరికృష్ణ విగ్రహాల తొలగింపు!
- ఇటీవల ఆవిష్కరించిన గంటా
- కోర్టును ఆశ్రయించిన స్థానికులు
- రాత్రికి రాత్రే తొలగించిన అధికారులు
ఈ ముగ్గురి విగ్రహాల ఏర్పాటుకు జరుగుతున్న పనులను గమనించిన స్థానికులు కొందరు, విశాఖకు ఏమాత్రం సంబంధం లేని వ్యక్తుల విగ్రహాలను తెచ్చి సమస్యలు సృష్టించాలని చూస్తున్నారని కోర్టును ఆశ్రయించగా, వాటిని వెంటనే తొలగించాలని కోర్టు ఆదేశించింది.
దీంతో స్పందించిన పోలీసులు, కార్పొరేషన్ అధికారులు గత రాత్రి వీటిని తొలగించారు. ఈ సమయంలో అక్కడికి చేరుకున్న సినీ ప్రముఖుల అభిమానులు అధికారులతో వాగ్వాదానికి దిగారు. అనుమతి లేని విగ్రహాలను తొలగించే విషయంలో ఎవరి ఒత్తిడికీ తలొగ్గేది లేదని ఈ సందర్భంగా అధికారులు స్పష్టం చేశారు.