ఫలించిన నీతా అంబానీ పూజలు... మ్యాచ్ ముగిసేవరకూ అమ్మవారి అక్షింతలు తలపైనే!
- బల్కంపేటలో ఎల్లమ్మ దేవాలయం
- అమ్మవారికి నీతా అంబానీ ప్రత్యేక పూజలు
- చివరి ఓవర్ ను చూడలేకపోయానన్న నీతా
ఇక నిన్న మ్యాచ్ తుది క్షణం వరకూ ఉత్కంఠగా సాగగా, ముంబై ఇండియన్స్ జట్టు ఒక పరుగు తేడాతో చెన్నై సూపర్ కింగ్స్ పై విజయం సాధించి, నాలుగోసారి కప్పును ఎగరేసుకుపోయిన సంగతి తెలిసిందే. మ్యాచ్ అనంతరం స్పందించిన నీతా అంబానీ, తాను చివరి ఓవర్ ను చూడలేకపోయానని, కళ్లు మూసుకునే కూర్చున్నానని, చివరి బాల్ కు మలింగ వికెట్ తీయడంతో తన ఆనందానికి అవధులు లేకుండా పోయాయని చెప్పారు. మ్యాచ్ ఆసాంతం ఇరు జట్లూ బాగా ఆడాయని కితాబిచ్చారు.