లండన్ లో హైదరాబాద్ యువకుడ్ని హత్యచేసింది ఓ పాకిస్థానీ!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

లండన్ లో హైదరాబాద్ యువకుడ్ని హత్యచేసింది ఓ పాకిస్థానీ!

  • ఉద్యోగంలోంచి తీసేశాడని దారుణం
  • నిందితుడ్ని ఆకిబ్ పర్వేజ్ గా గుర్తింపు
  • కోర్టులో హాజరుపర్చిన పోలీసులు
లండన్ లో హైదరాబాద్ కు చెందిన నదీముద్దీన్ అనే యువకుడు హత్యకు గురికావడం సంచలనం సృష్టించింది. 24 ఏళ్ల నదీముద్దీన్ ఆరేళ్ల క్రితం హైదరాబాద్ నుంచి లండన్ వెళ్లి అక్కడే ఓ డిపార్ట్ మెంటల్ స్టోర్ లో మేనేజర్ గా పనిచేస్తున్నాడు. అతని భార్య ఓ వైద్యురాలు. ఏడాది క్రితం అతడికి వివాహం జరగ్గా, నెలక్రితమే భార్య కూడా లండన్ వచ్చింది.

అయితే, రెండ్రోజుల క్రితం నదీముద్దీన్ తాను పనిచేస్తున్న స్టోర్ సమీపంలోనే దారుణంగా హత్యకు గురయ్యాడు. అతడిని చంపింది ఆకిబ్ పర్వేజ్ అనే పాకిస్థాన్ యువకుడని తెలిసింది. ఆకిబ్ రెండువారాల కిందటి వరకు నదీముద్దీన్ పనిచేస్తున్న స్టోర్ లోనే పనిచేసేవాడు. సరిగా పనిచేయడంలేదన్న కారణంతో ఆకిబ్ ను నదీముద్దీన్ విధుల్లోంచి తొలగించాడు. దాంతో అతడిపై కక్షగట్టిన ఆకిబ్ అదనుచూసి అంతమొందించాడు. బర్మింగ్ హామ్ లో ఈ పాకిస్థాన్ యువకుడ్ని అరెస్ట్ చేసిన పోలీసులు న్యాయస్థానం ఎదుట హాజరుపరిచారు.
London
UK
Hyderabad

More Telugu News