జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థపై నిషేధం విధించిన పాకిస్తాన్
- ఉగ్రవాద వ్యతిరేక చర్యలకు పాక్ శ్రీకారం
- 12 ఉగ్రవాద సంస్థలను నిషేధిత జాబితాలో చేర్చిన పాక్ సర్కారు
- పేరు మార్చుకున్న జైషే మహ్మద్
జైషే మహ్మద్ చీఫ్ మౌలానా మసూద్ అజహర్ పై ఇటీవలే ఐక్యరాజ్యసమితి అంతర్జాతీయ ఉగ్రవాది ముద్ర వేసింది. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ఐక్యరాజ్యసమితి ప్రకటన వెలువడిన కొన్నిరోజులకే జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థ తన పేరు మార్చుకుంది. ఇప్పుడా సంస్థ పేరు జైషే ముత్తాఖీ! మరి, పాకిస్థాన్ నిషేధించిన ఉగ్రవాద సంస్థల్లో జైషే మహ్మద్ ఉంది కానీ, జైషే ముత్తాఖీ ఉందా? లేదా? అన్న విషయంపై స్పష్టత రాలేదు.