'కల్కి' ట్రైలర్ రిలీజ్ తరువాత టెన్షన్ తగ్గిపోయింది: హీరో రాజశేఖర్
- ప్రశాంత్ వర్మ చాలా బాగా తీశాడు
- ట్రైలర్ కి మంచి రెస్పాన్స్ వస్తోంది
- మా నమ్మకం మరింత పెరిగింది
ఈ సందర్భంగా రాజశేఖర్ మాట్లాడుతూ .. "ఈ కథ తీసుకుని ప్రశాంత్ వర్మ నా దగ్గరికి వచ్చి కొత్తగా ట్రై చేద్దామని చెప్పినప్పుడు, ఇప్పుడు ఇలాంటి ప్రయోగాలు అవసరమా అనిపించింది. కానీ ఈ సినిమా టీజర్ .. ట్రైలర్ తెచ్చిన రెస్పాన్స్ చూసిన తరువాత నా టెన్షన్ తగ్గిపోయింది. ముఖ్యంగా 'ఏం సెప్తిరి .. ఏం సెప్తిరి' అంటూ నా మేనరిజాన్ని నేనే అనుకరించడం జనంలోకి బాగా వెళ్లింది. ట్రైలర్ కి మేము ఆశించినదానికంటే ఎక్కువ రెస్పాన్స్ వస్తోంది. చాలా బాగుందంటూ అంతా మెసేజ్ లు పెడుతున్నారు. సినిమా కూడా భారీ విజయాన్ని సొంతం చేసుకుంటుందనే నమ్మకం మరింత పెరిగింది" అని చెప్పుకొచ్చారు.