మండుతున్న ఎండలు.. దేవుడికి కూలర్ ఏర్పాటు
- దేశ వ్యాప్తంగా మండిపోతున్న ఎండలు
- కాన్పూర్ లోని పలు ఆలయాల్లో దేవుళ్లకు కూలర్ల ఏర్పాటు
- దేవుళ్లు కూడా ఉక్కపోతకు గురవుతారన్న పూజారి
ఈ సందర్భంగా నగరంలోని సిద్ధి వినాయక దేవాలయం పూజారి సుర్జీత్ కుమార్ దూబే మాట్లాడుతూ, దేవుళ్లు కూడా ఉక్కపోతకు గురవుతారని చెప్పారు. వాళ్లు కూడా మానవులులాంటి వారే అని అన్నారు. అందుకే స్వామివారిని చల్లగా ఉంచేందుకు కూలర్ ఏర్పాటు చేశామని చెప్పారు. వేడిని దృష్టిలో ఉంచుకుని ఆయనకు పలుచటి వస్త్రాలను ధరింపజేశామని తెలిపారు.