మద్యం మత్తులో రెచ్చిపోయిన కామాంధులు.. ప్రియుడిని కట్టేసి యువతిపై సామూహిక అత్యాచారం
- కర్ణాటకలోని మైసూరులో ఘటన
- మాట్లాడుకుంటున్న ప్రేమికులపై దాడి
- యువకుడిని చెట్టుకు కట్టేసి యువతిపై అత్యాచారం
వారిని చూసిన ఆరుగురు యువకులు అక్కడికి వెళ్లి వారితో అసభ్యంగా ప్రవర్తించారు. అప్పటికే మద్యం మత్తులో ఉన్న వారు యువకుడిని పట్టుకుని సమీపంలోని చెట్టుకు కట్టేసి చితకబాదారు. అనంతరం యువతిపై అఘాయిత్యానికి తెగబడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని నిందితుల కోసం గాలిస్తున్నారు. పరారీలో ఉన్న నిందితులను పట్టుకునేందుకు మూడు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్టు తెలిపారు. కాగా, నిందితుల దాడిలో తీవ్రంగా గాయపడిన యువతీయువకులను పోలీసులు ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.