జాతీయ రహదారిపై అదుపుతప్పిన గ్యాస్ ట్యాంకర్.. ఆరుగురికి తీవ్రగాయాలు
- ఇద్దరి పరిస్థితి విషమం
- రోడ్డు పక్కన షాపుల్లోకి దూసుకువెళ్లిన వాహనం
- గుంటూరు జిల్లా దాచేపల్లి వద్ద ఘటన
ఇండియన్ ఆయిల్ కంపెనీకి చెందిన ఈ ట్యాంకర్ వేగంగా వస్తూ దాచేపల్లి వద్ద అదుపు తప్పింది. రోడ్డు పక్కనున్న షాపులను పాక్షికంగా ధ్వంసం చేస్తూ దూసుకువెళ్లింది. ఈ సమయంలో అక్కడ ఉన్న ఆరుగురు వ్యక్తులు గాయపడ్డారు. వీరిని వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. క్షతగాత్రుల్లో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని వైద్య వర్గాలు తెలిపాయి. ప్రమాద ఘనటకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.