మీరు తిట్టే తిట్లు ఇటలీ వెళ్లి అక్కడివాళ్లకు నేర్పండి: ప్రియాంకపై యోగి ఫైర్
- అమేథిలో పిల్లల్ని చెడగొట్టవద్దు
- మొదట యువరాజు, ఇప్పుడు యువరాణి వచ్చారు!
- చివరికి అమేథీలో కూడా ఓడిపోతారు
అమేథీలోని అమాయకులైన పిల్లలకు తిట్లు నేర్పడం ఎందుకు? అదేదో మీ ఇటలీకి వెళ్లి అక్కడివాళ్లకు నేర్పొచ్చు కదా అని వ్యాఖ్యానించారు. "కాంగ్రెస్ ఎందుకు విఫలమవుతోందో తెలుసా? అది ప్రతికూల రాజకీయాలు చేస్తుంది కాబట్టి! మొదట యువరాజు (రాహుల్ గాంధీ)ని బరిలో దింపారు. ఇప్పుడు యువరాణి (ప్రియాంక గాంధీ)ని రంగంలోకి తీసుకువచ్చారు. మరి ఆ తర్వాతేమీలేదు, చివరికి అమేథీలో కూడా ఓడిపోబోతున్నారు" అంటూ యోగి ఆదిత్యనాథ్ వ్యాఖ్యానించారు.