నాపై 9 సార్లు దాడి చేశారు.. ఇండియా చరిత్రలో ఎప్పుడూ ఇలా జరగలేదు!: సీఎం కేజ్రీవాల్
- నిన్న మోతీనగర్ లో కేజ్రీవాల్ పై దాడి
- చెంపపై కొట్టిన యువకుడు కిశోర్
- బీజేపీనే చేయించిందన్న మనీశ్ సిసోడియా
ఇండియా చరిత్రలో ఓ ముఖ్యమంత్రిపై ఇన్నిసార్లు దాడులు జరగలేదని వ్యాఖ్యానించారు. భారత్ మొత్తంమీద కేవలం ఢిల్లీ ముఖ్యమంత్రి రక్షణ మాత్రమే బీజేపీ నేతల చేతుల్లో ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు బీజేపీనే ఈ దాడి చేయించిందని ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా ఆరోపించారు. కేజ్రీవాల్ ను చంపేయాలనుకుంటున్నారా? అని మండిపడ్డారు.