క్యాట్వాక్లో సందడి చేసిన ‘క్యాట్’.. ఆ తర్వాత ఏం చేసిందంటే?
- మొరాకాలో ఫ్యాషన్ షో video
- ర్యాంప్‌పై సందడి చేసిన పిల్లి
- టాయిలెట్ పోసి ఎంచక్కా వెళ్లిపోయిన వైనం
ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ క్రిస్టియన్ డియోర్ రూపొందించిన దుస్తుల డిజైన్లను మోడళ్లు ప్రదర్శిస్తున్నారు. ఆహూతులు కూడా అంతే సిరియస్‌గా దుస్తుల డిజైన్లను వీక్షిస్తున్నారు. తన లేకుండా క్యాట్వాక్కు అర్థం లేదనుకుందో ఏమో! ఎక్కడి నుంచే ఓ క్యాట్ (పిల్లి) ర్యాంపుపైకి వచ్చింది. వయ్యారాలు పోతున్న మోడల్స్‌కు మల్లే అది కూడా హుందాగా ‘వాక్’ చేసింది. ఆ తర్వాత ర్యాంపు పక్కన కూర్చున్న ఓ యువతి వద్దకు వెళ్లి ఆమె డ్రెస్‌పై టాయిలెట్ పోసి ఎంచక్కా వెళ్లిపోయింది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోపై నెటిజన్లు సరదా కామెంట్లతో హోరెత్తిస్తున్నారు.