jeevita: 'డిగ్రీ కాలేజ్' ట్రైలర్ చూసి ఏకిపారేసిన జీవిత!

షార్ట్స్‌లో చూడండి
'డిగ్రీ కాలేజ్' అనే సినిమా ద్వారా నరసింహ నంది అనే దర్శకుడు పరిచయమవుతున్నాడు. ఈ సినిమా ట్రైలర్ ఆవిష్కరణ తాజాగా హైదరాబాద్ లో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జీవిత, ఈ ట్రైలర్లోని శృంగార సన్నివేశాలను .. లిప్ లాకులను చూసి షాక్ అయ్యారు. అంతేకాదు ఈ ట్రైలర్ రిలీజ్ కి తనని పిలిచినందుకు అసహనాన్ని వ్యక్తం చేశారు.

"అర్జున్ రెడ్డి' .. 'ఆర్ ఎక్స్ 100' పుణ్యమా అని లిప్ లాక్ లేని తెలుగు సినిమా లేకుండా పోయింది. మనం ఇల్లు కట్టుకుంటే హాలులో కూర్చుంటాము .. బెడ్ రూములో పడుకుంటాము .. బాత్ రూమ్ లో స్నానం చేస్తాము. కానీ హాల్లోకి వచ్చి స్నానం చేయం గదా. ఏ పని ఎక్కడ చేయాలో అక్కడే చేయాలి .. రోడ్డుపై చేస్తే అసహ్యంగా ఉంటుంది. మనకూ కుటుంబాలు వున్నాయి .. ఆడపిల్లలు వున్నారు అనే సామాజిక బాధ్యతతో సినిమాలు చేయవలసిన అవసరం వుంది. మీ కార్యక్రమానికి వచ్చి నేను ఇలా మాట్లాడకూడదు. ఈ మాటలను కాంట్రవర్సీ కోసం కూడా చెప్పడం లేదు .. నా మనసుకి అనిపించింది చెప్పాను" అని అన్నారు.
Go Back to Shorts
jeevita

More Telugu News