marriage: పాప పుట్టిన 10 నెలలకు ప్రియుడిని పెళ్లాడిన న్యూజిలాండ్ ప్రధాని జెసిండా ఆర్డెన్!

షార్ట్స్‌లో చూడండి
న్యూజిలాండ్ ప్రధాని జెసిండా ఆర్డెన్ (38) వివాహం చేసుకున్నారు. తన ప్రియుడు, టీవీ వ్యాఖ్యత అయిన క్లార్కే గేఫోల్డ్(41) ను ఆమె పెళ్లి చేసుకున్నారు. దాదాపు 10 నెలల క్రితం ఈ జంటకు ఓ పాప పుట్టింది. ఈ నేపథ్యంలోనే వీరిద్దరూ వివాహబంధం ద్వారా ఒకటవ్వాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. దాదాపు ఆరేళ్ల క్రితం గేఫోల్డ్, జెసిండాల మధ్య పరిచయం ఏర్పడింది.

ఓ భద్రతా చట్టానికి సంబంధించి పార్లమెంటు సభ్యుడితో మాట్లాడేందుకు 2013లో గేఫోల్డ్ పార్లమెంటు హౌస్ వద్దకు చేరుకున్నారు. అక్కడే లేబర్ పార్టీలో చురుగ్గా పనిచేస్తున్న జెసిండాతో ఆయనకు పరిచయం ఏర్పడింది. ఇది కాస్తా ప్రేమగా మారడంతో ఇద్దరు కలిసి సహజీవనం చేయడం మొదలుపెట్టారు. ఇటీవల న్యూజిలాండ్ లో ఓ శ్వేతజాతి ఉన్మాది 51 మంది ముస్లింలను బలికొన్న సందర్భంగా జెసిండా బాధితులతో వ్యవహరించిన తీరుపై ప్రపంచవ్యాప్తంగా ప్రశంసల వర్షం కురిసింది.
Go Back to Shorts
marriage
Prime Minister
newzeland
jacinda

More Telugu News