kalyan ram: విరించి వర్మకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన కల్యాణ్ రామ్

షార్ట్స్‌లో చూడండి
ప్రస్తుతం కల్యాణ్ రామ్ తన తాజా చిత్రాన్ని వేణు మల్లిడి దర్శకత్వంలో చేయడానికి సిద్ధమవుతున్నాడు. ఈ సినిమాకి 'తుగ్లక్' అనే టైటిల్ ను ఖరారు చేశారు. సోషియో ఫాంటసీ నేపథ్యంలో ఈ కథ కొనసాగుతుందని అంటున్నారు. ఇంతవరకూ చేయని వైవిధ్యభరితమైన పాత్రలో కల్యాణ్ రామ్ చేయనున్నట్టుగా వార్తలు షికారు చేస్తున్నాయి.

ఇక ఈ సినిమా తరువాత ఆయన విరించి వర్మ దర్శకత్వంలో చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా సమాచారం. 'ఉయ్యాలా జంపాల' సినిమాతో తొలి హిట్ అందుకున్న విరించి వర్మ, ఆ తరువాత నాని హీరోగా 'మజ్ను' చేసి మంచి మార్కులు కొట్టేసిన సంగతి తెలిసిందే. ఆయన వినిపించిన పూర్తి స్క్రిప్ట్ పట్ల కల్యాణ్ రామ్ పూర్తి సంతృప్తి చెందినట్టుగా ఫిల్మ్ నగర్లో చెప్పుకుంటున్నారు. జూలై నుంచి రెగ్యులర్ షూటింగు మొదలుపెట్టాలనే నిర్ణయానికి వచ్చేశారు.  పల్లెటూరి నేపథ్యంలో సాగే ఈ కథకు కథానాయికలను తీసుకునే పనిలో వున్నట్టుగా సమాచారం. 
Go Back to Shorts
kalyan ram

More Telugu News