నేడు ఇంటర్ బోర్డు కార్యాలయాన్ని ముట్టడించనున్న అఖిలపక్షం.. 2న బీజేపీ రాష్ట్ర బంద్‌కు పిలుపు
- నేటి ముట్టడిలో పాల్గొననున్న టీడీపీ, టీజేఎస్, సీపీఐ
- ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల కుటుంబాలకు రూ.25 లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలని డిమాండ్
- నేటి నుంచి బీజేపీ నేత లక్ష్మణ్ నిరవధిక నిరశన
మరోవైపు, ఇంటర్ ఫలితాల్లో తప్పిదాలు, విద్యార్థుల ఆత్మహత్యలపై నేటి నుంచి నిరవధిక నిరశన దీక్ష చేపట్టనున్నట్టు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ ప్రకటించారు. విద్యాశాఖ మంత్రి జగదీశ్‌రెడ్డిని తొలగించాలని, ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల కుటుంబాలకు రూ.25 లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. అలాగే, ఫలితాల్లో అవకతవకలపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. కాగా, వచ్చే నెల 2న రాష్ట్ర బంద్ నిర్వహించనున్నట్టు బీజేపీ జాతీయ నేత మురళీధర్‌రావు తెలిపారు.