నిర్లక్ష్యం... కన్న బిడ్డను చేజేతులా పోగొట్టుకున్న తండ్రి!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

నిర్లక్ష్యం... కన్న బిడ్డను చేజేతులా పోగొట్టుకున్న తండ్రి!

  • పాపను కారులో మరచిపోయి సెంట్రల్ లాక్
  • ఊపిరాడక మరణించిన ఆరేళ్ల చిన్నారి
  • పెళ్లి జరుగుతున్న ఇంట విషాదం
ఓ కన్న తండ్రి నిర్లక్ష్యం కుమార్తె పాలిట శాపమై, ఆ ఇంట్లో తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. కారులో బిడ్డ ఉందని గమనించకుండా సెంట్రల్ లాక్ చేసిన ఆ తండ్రి అక్కడి నుంచి వెళ్లిపోయి, తన పనిలో పడిపోగా, ఊపిరాడని చిన్నారి విలవిల్లాడుతూ మరణించిన ఘటన జడ్చర్ల మండలం గంగాపూర్‌ లో జరిగింది.

తన సోదరుడి వివాహం నిమిత్తం పూలదండలు తెచ్చేందుకు కారులో తన ఆరేళ్ల కుమార్తెతో కలిసి వెళ్లిన అంజలయ్య, తిరిగి వచ్చి, కారులో నుంచి దండలు తీసుకున్నాడుగానీ, కూర్చుని ఉన్న బిడ్డను మాత్రం దింపలేదు. చిన్నారి కారు దిగకముందే కార్ లాక్‌ చేసి వెళ్లిపోయిన అంజలయ్య, వివాహ వేడుకల హడావుడిలో పడిపోయాడు. ఎంతో సేపటి తరువాత బిడ్డ కోసం చూసి, కారు వద్దకు వచ్చేసరికి ఆప్పటికే పాప మరణించింది. దీంతో అప్పటివరకూ కోలాహలంగా ఉన్న పెళ్లి ఇంట విషాదం అలముకుంది.
Daughter
Car
Lock

More Telugu News