KTR: నన్ను ఈరోజు ఏదైనా అడగండి.. వెంటనే జవాబిస్తా!: టీఆర్ఎస్ నేత కేటీఆర్

షార్ట్స్‌లో చూడండి
తెలంగాణ రాష్ట్ర సమితి(టీఆర్ఎస్) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి ప్రజలతో ముచ్చటించేందుకు సిద్ధమయ్యారు. ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకు ‘ఆస్క్ కేటీఆర్’ పేరుతో కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. ట్విట్టర్ వేదికగా ఈ చర్చలో ప్రజలు ఏ ప్రశ్నలనైనా తనను అడగొచ్చని అన్నారు.

ఈ మేరకు కేటీఆర్ ఓ ట్వీట్ చేశారు. మరోవైపు అంతకుముందు నిర్వహించిన ఓ కార్యక్రమంలో కేటీఆర్ మాట్లాడుతూ.. తెలంగాణలోని 16 లోక్ సభ స్థానాలను ఏకపక్షంగా గెలుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణకు టీఆర్ఎస్ పార్టీయే శ్రీరామరక్ష అని అభిప్రాయపడ్డారు.
Go Back to Shorts
KTR
Twitter
ask KTR
12 noon
TRS

More Telugu News