Rosaiah: ఈ పాలన సరిగ్గా లేదు: చానాళ్ల తరువాత మీడియాతో మాజీ సీఎం రోశయ్య!

షార్ట్స్‌లో చూడండి
ప్రజల కోరిక మేరకు ప్రభుత్వాల పాలన సాగటం లేదని మాజీ సీఎం, తమిళనాడు మాజీ గవర్నర్ కొణిజేటి రోశయ్య అభిప్రాయపడ్డారు. తెనాలికి వచ్చిన ఆయన, ఓ వ్యాపార సంస్థను ప్రారంభించగా, ఈ సందర్భంగా పలు పార్టీల నాయకులు ఆయన్ను మర్యాదపూర్వకంగా కలిశారు.

ఈ సందర్భంగా రోశయ్య మాట్లాడుతూ, పాలనా ఇబ్బందులను అధిగమించేందుకు ప్రయత్నాలు జరగాల్సి వుందని అన్నారు. ప్రజాభీష్టం మేరకు పాలన సాగకుంటే ఇబ్బందులు తప్పవని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ ఓ మహావృక్షం వంటిదని, లోటుపాట్లు ఉన్నా, అవన్నీ సర్దుకునేందుకు ఎంతో సమయం పట్టదని చెప్పారు.

ఎవరికి ఓటు వేయాలన్న విషయం ఓటర్లకు తెలుసునని, వారు తమ అభిప్రాయాన్ని ఈవీఎంలలో నిక్షిప్తం చేశారని, ఫలితాల కోసం ఎదురు చూడటం మినహా పోటీ పడిన అభ్యర్థుల ఎదుట మరో మార్గం లేదని అన్నారు. కాగా, టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆలపాటి రాజేంద్రప్రసాద్, వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అన్నాబత్తుని శివ కుమార్, కాంగ్రెస్ అభ్యర్థి చందు సాంబశివుడు తదితరులు రోశయ్యను కలిశారు.
Go Back to Shorts
Rosaiah
Tenali
Media

More Telugu News