స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ ప్రభంజనం సృష్టిస్తాం: కేటీఆర్
Add ap7am to your home Screen

స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ ప్రభంజనం సృష్టిస్తాం: కేటీఆర్

  • పదహారుకు పదహారు ఎంపీ స్థానాల్లో గెలుస్తాం
  • గల్లీ నుంచి ఢిల్లీ దాకా గులాబీ జెండానే ఎగురుతోంది
  • పార్టీ సంస్థాగత నిర్మాణాన్ని పటిష్టం చేసుకోవాలి
పదహారుకు పదహారు ఎంపీ స్థానాల్లో టీఆర్ఎస్ విజయం సాధిస్తుందని, అదే విధంగా, స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ ప్రభంజనం సృష్టిస్తామని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెలంగాణ భవన్ లో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.

ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ, నేడు గల్లీ నుంచి ఢిల్లీ దాకా గులాబీ జెండానే ఎగురుతోందని అన్నారు. 33 జిల్లాల్లో పార్టీ సంస్థాగత నిర్మాణాన్ని పటిష్టం చేసుకోవాలని, జిల్లాల్లో పార్టీ కార్యాలయాలను నిర్మాణం చేసుకోవాలని సూచించారు. పార్టీలో ఏవైనా సమస్యలు ఉంటే అంతర్గతంగా మాట్లాడుకోవాలే తప్ప, అందరిముందు మాట్లాడొద్దని తమ నాయకులకు సూచించారు. ఈ సందర్భంగా ప్రతిపక్షాలపైన ఆయన విమర్శలు గుప్పించారు. ప్రభుత్వం ఎక్కడ తప్పు చేస్తుందా అని ప్రతిపక్షం ఎదురుచూస్తోందని విమర్శించారు.     
Telangana
TRS
KTR
Telangana bhavan

More Telugu News