బీజేపీ అభ్యర్థికి మద్దతుగా ‘గ్రేట్ ఖలీ’.. పోటెత్తిన జనం
- పశ్చిమ బెంగాల్‌లోని జాదవ్‌పూర్ నుంచి ఖలీ స్నేహితుడి పోటీ
- మద్దతుగా నామినేషన్ దాఖలు కార్యక్రమానికి హాజరు
- చూసేందుకు పోటెత్తిన జనం
డబ్ల్యూడబ్ల్యూఈలో తొలి హెవీవెయిట్ రెజ్లింగ్ చాంపియన్ అయిన ఖలీని చూసేందుకు జనాలు పెద్ద ఎత్తున తరలిరావడంతో రోడ్ షో సక్సెస్ అయింది. ఏడడుగుల ఒక అంగుళం ఎత్తున్న ఖలీ జనాలవైపు చూసి చిరునవ్వు చిందిస్తూ, చేతులూపుతూ ముందుకు సాగాడు.
తాను ఎన్నికల్లో పోటీ చేస్తున్న విషయం తెలిసిన వెంటనే తను మద్దతుగా వస్తానని చెప్పాడని, తమ మధ్య ఉన్న సంబంధం అటువంటిదని హజ్రా తెలిపారు. గతంలో ఆయనెప్పుడూ ఇటువంటి కార్యక్రమాల్లో పాల్గొనలేదన్నారు. విశ్వభారతి యూనివర్సిటీ ప్రొఫెసర్ అయిన హజ్రా పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్నారంటూ ఈ ఏడాది జనవరిలో తృణమూల్ కాంగ్రెస్ ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. దీంతో ఆయన బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు.
హజ్రా ఎప్పుడు, ఎక్కడికి రమ్మని పిలిచినా వచ్చి ప్రచారం చేస్తానని పేర్కొన్న గ్రేట్ ఖలీ మాట్లాడుతూ.. హజ్రాకు ఓటేసి గెలిపించాలని ప్రజలను కోరారు. జాదవ్‌పూర్ నియోజక వర్గం నుంచి టీఎంసీ తరపున ప్రముఖ సినీ నటుడు మిమీ చక్రవర్తి పోటీ చేస్తుండగా, సీపీఎం నుంచి బికష్ భట్టాచార్య పోటీలో ఉన్నారు.