ప్రజ్ఞా సింగ్ గురించి తెలిస్తే ఆమెను సాధ్వి అనరు.. ఓ యువకుడ్ని ఆమె కత్తితో పొడిచారు: ఛత్తీస్ గఢ్ సీఎం తీవ్ర వ్యాఖ్యలు
- బిలైగడ్ వీధుల్లో కత్తి పట్టుకుని తిరిగారు
- ఎక్కడ గొడవ జరిగితే అక్కడ ప్రజ్ఞా సింగ్ ఉంటారు
- ఆమె నడవడిక ఓ క్రిమినల్ లాగా ఉండేది
ఎక్కడ గొడవ జరిగితే అక్కడ ప్రజ్ఞా సింగ్ ఉండేవారని తెలిపారు. ఆమె ప్రవర్తన చూస్తే ఓ క్రిమినల్ లాగా ఉండేది తప్ప సాధ్విలా ఎంతమాత్రం ఉండేది కాదన్నారు. అయితే, ఛత్తీస్ గఢ్ సీఎం వ్యాఖ్యలపై బీజేపీ నేతలు మండిపడుతున్నారు. సాధ్వీ ప్రజ్ఞాసింగ్ పై చేసిన వ్యాఖ్యలకు ఎలాంటి ఆధారాలు ఉన్నాయో చూపించాలని, లేకపోతే క్షమాపణలు చెప్పాలని మధ్యప్రదేశ్ బీజేపీ నేత హితేశ్ బాజ్ పాయి డిమాండ్ చేశారు.