ఒప్పందం లేకుండానే ‘గ్లోబరినా’కు కాంట్రాక్టు.. బయటపడుతున్న తెలంగాణ ఇంటర్ బోర్డు లీలలు!
- ఆత్మహత్య చేసుకున్న 19 మంది విద్యార్థులు
- త్రిసభ్య కమిటీని నియమించిన ప్రభుత్వం
- ఈరోజు రెండోసారి సమావేశం కానున్న కమిటీ
- రేపు తెలంగాణ ప్రభుత్వానికి నివేదిక సమర్పణ
ఇంటర్‌బోర్డు కార్యదర్శి అశోక్, గ్లోబరినా సంస్థ సీఈఓ వీఎస్‌ఎన్ రాజు, ఇంటర్‌బోర్డు ఓఎస్‌డీ సుశీల్‌కుమార్ సహా ఇతర ఉన్నతాధికారులతో నిన్న ఈ త్రిసభ్య కమిటీ సమావేశమయింది. ఈ సందర్భంగా ఇంటర్ బోర్డుతో ఒప్పందానికి సంబంధించి ఎలాంటి రికార్డులు తమవద్ద లేవని గ్లోబరినా ప్రతినిధులు చేతులు ఎత్తేశారు. ఈ నేపథ్యంలో వాటిని తప్పనిసరిగా తీసుకురావాలని కమిటీ ఆదేశించింది. కాగా, ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు చైర్మన్ వెంకటేశ్వరరావు, సభ్యులు వాసన్, నిశాంత్ లు మరోసారి సమావేశం కానున్నట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. కాగా, రేపు ఈ కమిటీ తన నివేదికను ప్రభుత్వానికి సమర్పించే అవకాశముందని భావిస్తున్నారు.