అటవీశాఖ కార్యాలయంపై మావోల మెరుపుదాడి.. 3 తుపాకులు, 7 సెల్ ఫోన్లు తీసుకుని పరారీ!
- ఒడిశాలోని నయాగఢ్ లో ఘటన
- ఉన్నతాధికారులకు సమాచారమిచ్చిన సిబ్బంది
- కూంబింగ్ ను ముమ్మరం చేసిన భద్రతాబలగాలు
అటవీశాఖ సిబ్బంది ఈ విషయాన్ని ఉన్నతాధికారులకు తెలియజేశారు. దీంతో రంగంలోకి దిగిన భద్రతాబలగాలు పారిపోయిన మావోయిస్టుల కోసం గాలింపును ముమ్మరం చేశాయి. మూడో విడత సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా నిన్న ఒడిశాలో 6 లోక్ సభ సీట్లకు ఎన్నికలు జరిగాయి. పోలీసులు, బలగాలు ఈ ఎన్నికల విధుల్లో నిమగ్నమైన నేపథ్యంలో మావోయిస్టులు అటవీశాఖ కార్యాలయంపై మెరుపుదాడి చేశారు.