East Godavari District: ప్రియుడితో పారిపోతున్న కుమార్తెను పట్టుకున్న తండ్రి... కత్తితో పొడిచి పరార్!

  • తూర్పు గోదావరి జిల్లా అనపర్తిలో ఘటన
  • కన్నతండ్రని కూడా చూడకుండా దాడి
  • పరారైన జంట కోసం పోలీసుల గాలింపు

ప్రియుడితో కలిసి పారిపోతున్న కుమార్తెను ఓ తండ్రి అడ్డుకోగా, ఆమె కత్తితో పొడిచి పారిపోయిన ఘటన తూర్పు గోదావరి జిల్లాలో కలకలం రేపింది. అనపర్తి పోలీసులు వెల్లడించిన మరిన్ని వివరాల ప్రకారం, పట్టణానికి చెందిన ఓ వ్యాపారి కుమార్తెకు, మరో యువకుడికి మధ్య గత కొంతకాలంగా ప్రేమాయణం సాగుతోంది.

ఈ క్రమంలో వారిద్దరూ ఇల్లు వదిలి పారిపోవాలని నిర్ణయించుకున్నారు. అయితే, ప్రియుడితో కలసి పారిపోయేందుకు సిద్ధంగా ఉన్న కుమార్తె తండ్రి కంటపడింది. ఆమెను అడ్డుకోగా, అప్పటికే తమ వద్ద ఉంచుకున్న కత్తితో, కన్న తండ్రని కూడా చూడకుండా అతన్ని పొడిచి, ఆ వెంటనే ప్రియుడితో కలిసి పారిపోయింది. ఈ ఘటనలో తీవ్రగాయాలపాలైన తండ్రిని స్థానికులు ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు, పారిపోయిన జంట కోసం విస్తృతంగా గాలిస్తున్నారు.

More Telugu News