Nagarjuna: బిగ్ బాస్ -3 హోస్ట్ గా నాగార్జున!

  • మూడో సీజన్ కు సిద్ధమైన బిగ్ బాస్
  • 'ఆర్ఆర్ఆర్'తో బిజీగా ఉన్న ఎన్టీఆర్
  • వ్యాఖ్యాతగా ఉండేందుకు అంగీకరించిన నాగ్!

తెలుగు బుల్లితెర ప్రేక్షకులను 'బిగ్ బాస్' ఎంతగా అలరించిందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఇప్పటికే రెండు సీజన్ లు సాగిన ఈ షో, ఇప్పుడు మూడో సీజన్ కు సిద్ధమవుతోంది. బిగ్‌ బాస్ -1లో ఎన్టీఆర్, బిగ్ బాస్ -2లో నాని హోస్ట్‌ గా మెప్పించగా, మూడో సీజన్ కోసం తొలుత ఎన్టీఆర్‌‌ నే అడిగారట. అయితే రాజమౌళి, రామ్ చరణ్ కాంబినేషన్ లో 'ఆర్ఆర్ఆర్'లో బిజీగా ఉన్న కారణంగా ఎన్టీఆర్ నిరాకరించారట. దీంతో ఆ చాన్స్ టాలీవుడ్ హీరో నాగార్జునకు దక్కగా, ఆయన అంగీకరించినట్టు తెలుస్తోంది. 'మీలో ఎవరు కోటీశ్వరుడు' షోకు వ్యాఖ్యాతగా వ్యవహరించి అందరినీ అలరించిన ఆయన, బిగ్ బాస్ ను కూడా సక్సెస్ ఫుల్ గా నడుపుతారని నిర్వాహకులు భావిస్తున్నారు.

More Telugu News