దేశాన్ని నడుపుతున్నారా.. లేక పబ్ జీ గేమ్ ఆడుతున్నారా?: అమిత్ షాపై ఒవైసీ సెటైర్లు
- పుల్వామాలో ఉగ్రదాడిపై అమిత్ షా కామెంట్
- మోదీ తన వాయుసేనను పంపారని వ్యాఖ్య
- ట్విట్టర్ లో వెటకారంగా స్పందించిన ఒవైసీ
ట్విట్టర్ లో ఒవైసీ స్పందిస్తూ.. ‘మోదీజీ సైన్యం.. మోదీజీ ఎయిర్ ఫోర్స్, మోదీజీ న్యూక్లియర్ బాంబు... ఇప్పటివరకూ ఏయే ఆస్తులు దేశానికి ఉన్నాయో అవన్నీ గత ఐదేళ్లలో మోదీవి అయిపోయాయి. దేశాన్ని నడుపుతున్నారా? లేక పబ్ జీ గేమ్ ఆడుతున్నారా?’ అని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. దీనికి పీఎంవో ట్విట్టర్ హ్యాండిల్ ను ట్యాగ్ చేశారు.