భర్త వేధింపులు తట్టుకోలేక కడుపుతీపినే చంపుకుంది...గొంతుకోసి బిడ్డ హత్య!

షార్ట్స్‌లో చూడండి
అనుమానం పెనుభూతంగా మారి నిత్యం సాధిస్తున్న భర్త వేధింపులు తట్టుకోలేని ఓ మహిళ నవమాసాలు మోసి కన్న బిడ్డను కూడా కాదనుకుంది. కడుపు తీపిని చంపుకొని బిడ్డను హత్యచేసి తానూ ఆత్మహత్యా యత్నానికి పాల్పడింది. హైదరాబాద్‌ జీడిమెట్ల పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో జరిగిన ఈ దారుణానికి సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు ఇలావున్నాయి.

ఈ ప్రాంతానికి చెందిన నారాయణరెడ్డి, సుశీల దంపతులకు ఏడాదిన్నర కొడుకు ఉన్నాడు. అనుమానం రోగంతో బాధపడుతున్న నారాయణరెడ్డి ప్రవర్తన శ్రుతి మించడంతో తట్టుకోలేకపోయిన సుశీల ఈరోజు తెల్లవారు జామున మూడు గంటల ప్రాంతంలో కూరగాయలు కోసుకునే కత్తితో బిడ్డ గొంతు కోసి చంపేసింది. అనంతరం తాను గొంతుకోసుకుని ఆత్మహత్యా యత్నం చేసింది. విషయం తెలిసిన స్థానికులు సుశీలను సూరారంలోని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె అక్కడ కోలుకుంటోంది.
Go Back to Shorts
Hyderabad
jeedimetla
chaild murder

More Telugu News