శ్రీలంక పేలుళ్లలో ఇద్దరు జేడీఎస్ నేతల మృతి: అధికారికంగా ప్రకటించిన సుష్మాస్వరాజ్

  • మరో ఐదుగురి ఆచూకీ కోసం యత్నాలు
  • ఈనెల 20న  కొలంబో వెళ్లిన కర్ణాటక నాయకులు 
  • ద షాంగ్రిలా హోటల్‌లో బస... అక్కడే పేలుళ్లు
కర్ణాటక రాష్ట్రం నుంచి శ్రీలంక విహార యాత్రకని వెళ్లిన ఏడుగురు జనతాదళ్‌ సెక్యులర్‌ (జేడీఎస్‌) నాయకుల్లో ఇద్దరు చనిపోయినట్టు భారత విదేశాంగ శాఖ ప్రకటించింది. విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్‌ ఈ విషయాన్ని వెల్లడించారు. రెండో విడత ఎన్నికల తర్వాత ఈనెల 20న ఈ ఏడుగురు నాయకులు శ్రీలంకకు వెళ్లారు. అక్కడి ద షాంగ్రిలా హోటల్‌లోని రెండు గదులు అద్దెకు తీసుకుని బస చేశారు. నిన్న శ్రీలంకలో ఎనిమిది చోట్ల జరిగిన వరుస పేలుళ్లలో ద షాంగ్రిలా హోటల్‌ కూడా ఒకటి. ఈ పేలుడు అనంతరం ఈ ఏడుగురి నేతల ఆచూకీ తెలియకుండా పోవడంతో ఆందోళన నెలకొంది. ఇద్దరు చనిపోయినట్లు తేలడంతో మిగతా వారి ఆచూకీ కోసం ప్రయత్నిస్తున్నారు. కాగా, నేతల మృతి పట్ల కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
Go Back to Shorts
Karnataka
JDS leaders
missing in colombo

More Telugu News