ఎన్ఐఏ తనిఖీల్లో ఐసిస్ సానుభూతిపరుడు అబ్దుల్ బాసిత్ భార్య అరెస్ట్
- నిన్నటి నుంచి ఎన్ఐఏ సోదాలు
- నిన్న పలువురి అరెస్ట్
- సిరియాకు వెళ్లేందుకు యత్నించిన బాసిత్ అరెస్ట్
సిరియా వెళ్లేందుకు ఎన్నోసార్లు యత్నించి బాసిత్ అరెస్ట్ అయ్యాడు. అయితే బాసిత్‌కు సంబంధించిన మరో ఆసక్తికర విషయం ఎన్ఐఏ విచారణలో వెలుగులోకి వచ్చింది. అతను తన అరెస్ట్‌కు కొన్ని నెలల ముందే రెండో వివాహం చేసుకున్నట్టు విచారణలో తెలిసింది. బాసిత్ ఇచ్చిన సమాచారంతో పాతబస్తీలోని రెండో భార్య నివాసంలోనూ అధికారులు సోదాలు నిర్వహించారు.