మెగా కోడలు ఉపాసనకు దాదాసాహెబ్ ఫాల్కే సేవా పురస్కారం
- ఉత్తమ పరోపకారి పురస్కారం ప్రదానం
- దాతృత్వ సేవలకు గుర్తింపు
- ట్వీట్ చేసిన ఉపాసన
తనకు ఈ అవార్డు రావడం పట్ల ఉపాసన హర్షం వ్యక్తం చేశారు. "నిజంగా ఎంతో ఆనందంగా ఉంది. ప్రతిరోజు మంచి పనులు చేసేలా శుభసందేశాలు పంపించే సానుకూల దృక్పథం ఉన్న నా ప్రజలందరికీ ఈ అవార్డును అంకితం చేస్తున్నాను. నన్ను అన్నివిధాలా వెన్నంటి ఉండే నా ప్రియమైన కుటుంబానికి కృతజ్ఞతలు" అంటూ ఆమె ట్వీట్ చేశారు.